Header Banner

మరో కొత్త ఫీచర్ను తీసుకురాబోతున్న వాట్సాప్.. ఇక ఫొటోలు, వీడియోల డౌన్లోడ్ కంట్రోల్ మీ చేతుల్లోనే!

  Tue Jun 10, 2025 11:20        Technology

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు బిలియన్ల యూజర్లు ఉన్నారు. యూజర్లను దృష్టిలో ఉంచుకుని మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా యూజర్లకు మరో శుభవార్తను అందించింది. వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోల ఆటో డౌన్‌లోడ్ క్వాలిటీ విషయంలో నియంత్రణను యూజర్లకే ఇవ్వనుంది. వాట్సాప్ ట్రాకర్ WABetainfo నివేదిక ప్రకారం ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.18.11 వాట్సాప్ బీటాలో యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌తో తమ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యే మీడియా ఫైల్స్ (ఫోటోలు, వీడియోలు) క్వాలిటీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అవసరం లేకపోతే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేసుకునే సౌలభ్యం కూడా యూజర్లకు ఉంటుంది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఇలాంటి సదుపాయం లేదు.

 

ఇది కూడా చదవండి: బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

ఈ ఆప్షన్ కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటాలో డౌన్‌లోడ్ క్వాలిటీని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్, హెచ్‌డీ ఆప్షన్‌లలో మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. స్టాండర్డ్ క్వాలిటీని ఎంపిక చేసుకుంటే యూజర్లు ఎవరికైనా పంపే ఫోటోలు, వీడియోల క్వాలిటీ తగ్గుతుంది. తద్వారా డేటాతో పాటు మొబైల్ స్టోరేజ్ తక్కువగా ఉన్నా సరిపోతుంది. హెచ్‌డీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే డేటా వినియోగం పెరుగుతుంది. అదే సమయంలో మొబైల్‌లో ఎక్కువ స్టోరేజ్ ఆక్రమిస్తుంది. ఈ సెట్టింగ్స్‌ను స్టాండర్డ్‌గా సెట్ చేసిన సమయంలో వాట్సాప్ మీడియా ఫైల్స్‌ను డిఫాల్ట్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. అయితే యూజర్లు అదే ఫైల్ హెచ్‌డీ వెర్షన్‌ను యాప్‌లో చూసి మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను వాట్సాప్ ఇటీవల డ్యూయల్ అప్‌లోడ్ ఫీచర్ ఆధారంగా తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్లే బీటా ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. మెటా ఏప్రిల్‌లో ఐఓఎస్ వెర్షన్ కోసం ఇలాంటి ఫీచర్‌నే ప్రారంభించింది, కానీ ఇప్పటి వరకు యూజర్లందరికీ అందుబాటులోకి రాలేదు. 

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Whatsapp #Tech-News #Phones #UPdate #NewFearure #AutoDownload